​ప్రార్థన, భక్తి మార్గమే జీవితానికి నిజమైన వెలుగు: రేవరెండ్ చంద్రన్ డేవిడ్.

​సామాజిక శాంతి, నైతిక విలువల పెంపొందింపులో ఆధ్యాత్మిక వేదికల పాత్ర కీలకం: వేము ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ నాయుడు.

రేణిగుంట ఆగష్టు 9.
​తిరుపతి జిల్లా రేణిగుంట పుత్తూరు రోడ్డు సమీపంలోని జెరూసలేమ్ అపోస్తలిక్ చర్చిలో 34వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చంద్రశేఖర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా, సీఐ రవి, రేవరెండ్ లలిత కుమారి, రేవరెండ్ దేవ స్వరూప్, బ్రదర్ ప్రవీణ్, పాస్టర్ యేసు పాదం, బ్రదర్ వెంకట పాదం పాల్గొని ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేశారు.
​ఈ సందర్భంగా చర్చి ఫౌండర్ రేవరెండ్ చంద్రన్ డేవిడ్ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ.. ప్రార్థన, భక్తి మార్గమే జీవితానికి నిజమైన వెలుగు అని, దేవుని వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ప్రేమ, సహనాన్ని నింపుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ తోటివారికి సాయపడాలని పిలుపునిచ్చారు.అనంతరం ముఖ్య అతిథి చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడంలో చర్చిలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, యువత చదువుతో పాటు దైవచింతన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం భక్తులందరికీ విందు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *