మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 9: మండలంలోని బంజపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను నియంత్రించేందుకు గడ్డి మందు పిచికారీ చేశారు.గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది రోడ్డు పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగిన ప్రాంతాలను గుర్తించి మందు పిచికారీ చేశారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు రహదారుల వెంట మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ తరఫున చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ అనీస్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *