శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పవిత్ర అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా, కనులపండువగా విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన కూటమి నాయకులకు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అధికారులకు, దేవస్థాన సిబ్బందికి, పోలీసు శాఖ అధికారులకు మరియు సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, విద్యుత్ శాఖ అధికారులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరి సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి దివ్య అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *