రేణిగుంట జులై 20.
ఈ రోజు రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రయాణికుడు పొరపాటున మర్చిపోయిన బ్యాగును రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో మూడు మొబైల్ ఫోన్లు (ఒక ఐఫోన్ , రెండు వన్ ప్లస్ మొబైల్ ఫోన్లు) మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.

పోలీసులు వెంటనే బ్యాగు యజమానిని గుర్తించి, అందులోని వస్తువులను పరిశీలించి, పూర్తి ధృవీకరణ అనంతరం బ్యాగుతో పాటు మూడు మొబైల్ ఫోన్లను బాధితుడికి భద్రంగా అప్పగించారు.

ఈ సందర్భంగా బాధితుడు రేణిగుంట పోలీసుల నిజాయితీ, అప్రమత్తత మరియు సత్వర స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *