మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. నేడు నాటే మొక్కలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించాలని గ్రామస్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి నవ్య, పంచాయతీ కార్యదర్శి శిరీష, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మధుసూదన్, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *