ఏర్పేడు జులై 16. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల పరిధిలోని రాజులపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ఏర్పేడు తహసిల్దార్ రాజశేఖర్, ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో ఈ పరిశీలన కార్యక్రమం జరిగింది. గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా అనువైన ప్రభుత్వ స్థలాలను సర్వేయర్ల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించి హద్దులను గుర్తించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ భూముల పరిశీలన వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, రాఘవేంద్ర, చంద్ర శేఖర్ నాయుడు, వెంకయ్య, కేశినేని సుబ్రమణ్యం, గుణా యాదవ్, రాచేటి సుబ్రమణ్యం, కేకే రమణ, వై మనోహర్ నాయుడు, రెవెన్యూ సర్వేయర్లు మరియు స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *