ఉదయగిరి మహనీయులు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన బొల్లినేని కార్తీక్

ఉదయగి జూలై 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు…

ఉదయగిరి పట్టణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ వారి 221వ గంధ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు తనయుడు టీడీపీ యువ నాయకుడు బొల్లినేని కార్తీక్ పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.గంధ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఖవ్వాలి పోటీలకు బొల్లినేని కార్తీక్ లక్ష రూపాయలు స్పాన్సర్‌షిప్ అందించారు. పోటీల నిర్వహణకు సహకారం అందించిన ఆయనను దర్గా కమిటీ సభ్యులు అభినందించారు.అనంతరం మహమ్మద్ హనీఫ్ అయాజ్ ఖాలిది రచించిన ‘ఉదయగిరి మహనీయులు’ పుస్తకాన్ని బొల్లినేని కార్తీక్ ఆవిష్కరించారు. ఉదయగిరి ప్రాంతానికి చెందిన మహనీయుల జీవిత విశేషాలు, వారు సమాజానికి అందించిన సేవలను భావితరాలకు పరిచయం చేసేందుకు ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయిత తెలిపారు. ఈ కార్యక్రమానికి సయ్యద్ రజి అహ్మద్ రోజ్దార్, హైకోర్టు న్యాయవాది డా. మున్నెల్లి శివశంకరయ్య, న్యాయవాది సయ్యద్ కలీమ్ అహ్మద్ రోజ్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు పుస్తక రచయిత మహమ్మద్ హనీఫ్ అయాజ్ ఖాలిదిని అభినందించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు మన్సూర్ రోజ్దార్,టిడిపి రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు రియాజ్, దర్గా కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *