తుడా చైర్మన్ కు అభినందనలు తెలిపి,గంగమ్మ తల్లి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థాన కమిటీ.సభ్యులుఆలయ అభివృద్ధి, భక్తుల వసతులపై ప్రత్యేక చర్చతుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ని, తిరుపతి నగర గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ శ మహేష్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ అమ్మవారి ఆలయ పవిత్ర తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని తుడా చైర్మన్ కు అందజేసి, గంగమ్మ తల్లి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

