కొండాపురం జులై 10, ఎల్లో సింగం ప్రతినిధి నాగరాజు కె..

ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండల పరిధిలో సత్యవోలు ,కొమ్మి గ్రామ సచివాలయాలలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై ఎంపీడీవో, డిప్యూటీ ఎమ్మార్వో, బూత్ బి ఎల్ ఓ లతో సమావేశమై కార్యక్రమ వివరాలను తెలుసుకున్న టిడిపి కొండాపురం మండల అధ్యక్షులు పోలినేని చంద్రబాబు నాయుడు, క్లస్టర్ ఇంచార్జీ పోలినేని రమేష్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్,ఈ సందర్భంగా పోలినేని చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం ​స్థానిక ఎంపీడీవో మరియు డిప్యూటీ తాసిల్దార్, బిఎల్ఓ లతో కలిసి కొమ్మి గ్రామ సచివాలయ పరిధిలోని ఓటర్ల వివరాలను, జాబితా సవరణలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.​ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో అందరూ రాబోయే 4 రోజులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏ బూతులోనైనా ఎటువంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ గద్దె రాగయ్య, బూత్ ఇంచార్జీ లు చెరుకూరి శేషయ్య,శ్రీకాంత్ ,ఆకుల మహేశ్ , భాస్కర్ , శ్రీను,వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *