మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ అన్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో పంచాయతీ కార్యదర్శి శిరీషతో కలిసి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ మాట్లాడుతూ… మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు.అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలును పరిశీలించిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సర్పంచ్ బోయిని హరికుమార్,పంచాయతీ కార్యదర్శి శిరీష భోజనం చేశారు.విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు చాకలి మైపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, ఉపాధ్యాయులు గణేష్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

