రేణిగుంట:
రేణిగుంట మండలంలో గంజాయి విక్రయిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేశారని రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీస్ఆ దేశాల మేరకు ఈ దాడి జరిగింది.
వినాయకపురం డంపింగ్ యార్డు వద్ద గాజులమండ్యం ఎస్సై ఎస్. హరీష మరియు పోలీస్ బృందం ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తుండగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వస్తూ పారిపోవడానికి ప్రయత్నించిన ఇంద్రజిత్ రామ్ (42) అనే వ్యక్తిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందినవాడని, ప్రస్తుతం రేణిగుంట వినాయక నగర్‌లో నివసిస్తున్నాడని విచారణలో తేలింది.
