శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. – భారీ కేక్ కట్ చేసి సంబరాలు – “బొల్లినేని నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ మార్మోగిన నినాదాలు..హోరెత్తిన అభిమానులు..

కలిగిరి, జూలై 4, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు,ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు జన్మదిన వేడుకలు కలిగిరిలో శనివారం అత్యంత వైభవంగా అంగరంగ నిర్వహించారు. కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమాన నాయకుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బొల్లినేని వెంకట రామారావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని, ప్రజా జీవితంలో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు కోరారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా “బొల్లినేని నాయకత్వం వర్ధిల్లాలి”, “బొల్లినేని వెంకట రామారావు జిందాబాద్” అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో పరిసరాలను మార్మోగించారు. నాయకుడిపై తమకున్న అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటుతూ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బొల్లినేని వెంకట రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. నేషనల్ హైవే నిర్మాణానికి కృషి, కామధేను ప్రాజెక్టు, వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) అభివృద్ధి వంటి అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన నిరంతరం పనిచేశారని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఊసా మాల్యాద్రి, కట్టా వెంకటేశ్వర్లు, స్వర్ణ కొండయ్య, వేములపాటి మణి, లెక్కల రాంబాబు, కాకునూరి మల్లికార్జున రెడ్డి, గూడూరు రామచంద్రారెడ్డి, బొగ్గవరపు వేణు, కొండపల్లి వెంకటేశ్వర్లు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *