కృష్ణారెడ్డి పాలెం లో పోలేరమ్మ మహోత్సవంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బులినేని వెంకట రామారావుకు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,,
ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం అందజేత..

కలిగిరి జూలై 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం (తోకలవారిపాలెం), జూలై 2 కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని తోకలవారిపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ, శీతల, నాభిశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలకగా, గ్రామస్తులు మేళతాళాలు, తప్పేటగుళ్ల నాదాలు, బాణాసంచాతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలతో బొల్లినేని వెంకట రామారావు ఆప్యాయంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, సమాజంలో ఐకమత్యం, సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీకలు. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి భావితరాలకు మన సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని అన్నారు.అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళాన్ని అందజేసి, ఆలయాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన సహకారం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *