నర్రవాడలో ఘనంగా వెంగల్–మధులిక వివాహ రిసెప్షన్
దుత్తలూరు, జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన చి॥ వెంగల్ – చి॥ల॥సౌ మధులికల వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లంపాటి గురవయ్య నాయుడు, రాజేశ్వరి దంపతుల కుమారుడు వెంగల్ వివాహ రిసెప్షన్ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, టిడిపి యువ నేత బొల్లినేని కార్తీక్ తదితరులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథుల సందడితో ఘనంగా జరిగింది.