ఉదయగిరి, జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఉదయగిరి పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రి తమ ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, టిడిపి యువనేత బొల్లినేని కార్తీక్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు రియాజ్, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
