రేణిగుంట జూన్ 13.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ను నాయుడుపేటలోని వారి స్వగృహంలో అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు. సీనియర్ మాజీ ఎంపీ గా, మాజీ ఎమ్మెల్యే గా మరియు ప్రస్తుత సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి విజయశ్రీ తండ్రిగా దళితులకు అండగా నిలచి సహాయ సహకారాలు అందించాలని నెలవల సుబ్రమణ్యం ను స్టార్ కృష్ణ కోరారు. సానుకూలంగా స్పందించిన మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం ఎల్లవేళలా దళిత బహుజనుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని భరోసా ఇచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన సైంటిస్ట్ కోదండ, చేతన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *