- చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల వ్యంగ్య పాత్రలతో వేషధారణ
- సుపరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది..
- అప్పనంగా 57 ఎకరాల భూమినీ మింగేసిన భరత్
- హామీల అమలు చేయడంలో కూటమి వైఫల్యం..
- రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సీతమ్మధార :
కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందనిమాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సందర్భంగా వాసుపల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, వైసీపీ నేతలు,దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా పరిషత్ జంక్షన్ ఆమ్కోసా ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చెడు వినకు,చూడకు,మాట్లాడకు, అనే వానర ఆకృతులతో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మాస్కులతో ధరించిన వ్యంగ్య వేషధారణలు వినూత్నంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ కులాల పెద్దలు, మత సంఘాల పెద్దలు,అనుబంధ సంఘాల పెద్దలు పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై వారి వారి అభిప్రాయాలు తెలిపారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అనేక మోసాలు చూసామన్నారు.గత ప్రభుత్వం పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేసి సుపరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్, కళ్యాణ్, లోకేష్ వైసీపీ కన్నా అత్యధికంగా పథకాలు ఇస్తామని సూపర్ సిక్స్ అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారు.దక్షిణాది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గు మంటున్నాయన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల విధ్వంసం చూసామన్నారు.మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కూటమి నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. రైతులు యూరియా కోసం లైన్లు కట్టడం చూసాము,సమయానికి యూరియా అందక పంట నష్టపోయారన్నారు.
కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.పేదలకు వైద్య విద్యను అందించే ఉద్దేశ్యం తో నిర్మించిన 17మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసిన దుర్మార్గులు చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ అని అన్నారు.
అమరావతి ఎత్తిపోతల పథకానికి వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారు.
*ఉత్తరాంధ్ర వైద్య ప్రదాయిని కేజీహెచ్ అభివృద్ధి కి 500కోట్ల వైసీపీ పాలనలో ఇచ్చారనీ వాసుపల్లి గుర్తు చేశారు*.
2029లో జగన్మోహన్ రెడ్డి పాలన రావడం ఖాయం అని వాసుపల్లి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వెంటేశ్వర స్వామి గుడికి దండాలు పెట్టి గుడిమెట్లకి కుంకుమ, పసుపు రాసి దేవుణ్ణి కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు అండ్ కో దేవాలయాలపై దాడులు చేస్తే నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. అందుకే పవన్ ఆసుపత్రిలో జాయిన్ అయి లంగ్స్, ముక్కుకి ఆపరేషన్లు చేయించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ని జైల్లో పెట్టాలి అన్నాడు. ఆ మాటకి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డికి మంచిపేరు ఉంది. అందుకే అమిత్ షా చంద్రబాబు నాయుడు ని దగ్గరకు కూడా రానివ్వడం లేదన్నారు. కొంతమంది అమ్ముడుపోయిన కార్పొరేటర్లు వలనే భరత్ అప్పనంగా 57ఎకరాల భూమి నీ కొట్టేసాడన్నారు.
మళ్లీ మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక గీతం యూనివర్సిటీ పేరుతో దోచుకున్న పేదల భూమిని వెనక్కి తీసుకుని వస్తాం అని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలపై , ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను పోస్టర్ లు ద్వారా ప్రదర్శించి నిరసన తెలిపారు.అనంతరం న్యాయవాది ప్రేమ్ కుమార్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కే మోసెస్, బీసీ సెల్ తిరుమల దేవి,31 వ వార్డు సీనియర్ నాయకులు శేఖర్, వార్డు మైనార్టీ అధ్యక్షులు సిహెచ్ కరుణాసాగర్, 35వ వార్డు సీనియర్ నాయకులు చక్రధర్, 36వ వార్డు కార్యదర్శి మహమ్మద్ భాష, 37వ వార్డ్ సీనియర్ నాయకులు కళ్యాణముని, 32 వార్డు బూత్ కమిటీ కార్యదర్శి రామారావు, 33 వ వార్డు నుండి బి శ్రీనివాస్ రెడ్డి, బి లక్ష్మి, 34వ వార్డు జీ కనకరాజు, పాస్టర్ కుర్నిలీస్, 42వ వార్డు ఎం వెంకటేశ్వరరావు, పాల్గొని రౌండ్ టైం సమావేశంలో మాట్లాడారు*.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, మాజీ కార్పొరేటర్ కోడిగుడ్లల పూర్ణిమ శ్రీధర్,తోట పద్మావతి,బిపిన్ జైన్,వార్డ్ ప్రెసిడెంట్ ,నీలపు సర్వేశ్వర రెడ్డి,పీతల వాసు, దశమంతులు మాణిక్యాలరావు ,దొడ్డి బాపూఆనంద్,పిన్నింట్ల రాజారెడ్డి, ముత్తాబత్తుల రమేష్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ లింగం శ్రీను,మాజీ కార్పొరేటర్ పత్తిరపల్లి రాము, మాజీ కోఆప్షన్ మెంబెర్ షరీఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ గనగల రామరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు,జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆది విష్ణు రెడ్డి , స్టేట్ బీసీ నాయకులు లండ రమణ, స్టేట్ నాయకులు కనకలే ఈశ్వరరావు, దస్మంతుల చిన్ని, వేలంగిని రావు, భానుమూర్తి, షబీర బేగం, బోరా విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఈతలపాక విజయ్ భాస్కర్,జిల్లా ప్రెసిడెంట్ సనపల రవీంద్ర,వడ్డాది దిలీప్,ప్రసాద్,236 బూత్ ప్రెసడెంట్స్,జిల్లా అనుబంధ సంఘాల, సౌత్ అనుబంధ సంఘాల,వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.