శ్రీకాళహస్తి, జూన్ 5.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారి ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ పిలుపుతో శుక్రవారం పట్టణంలోని పలు పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
పోలీస్ శాఖ వారి ప్రత్యేక అనుమతితో శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణల్లో కౌన్సిల్ ప్రతినిధులు ఉత్సాహంగా మొక్కలను నాటారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విష్ణుకాంత్, రాయలసీమ జోన్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు మునీగోవిందు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కలాం, జిల్లా ఇన్‌ఛార్జ్ మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు చెంచు రత్నం పాల్గొన్నారు. అలాగే జిల్లా మహిళా విభాగం ఇన్‌ఛార్జ్ వి. అపర్ణ, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శిరీష, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ సర్దార్, పట్టణ కార్యదర్శి ఖలీల్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు కౌన్సిల్ ప్రతినిధులు చొరవ చూపడంపై పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
