మంథ్యాస ప్రతినిధి పాచి పెంట, ,మే 28 :-
సాలూరు జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ పాచిపెంట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరు చిట్టూరి రమణమూర్తి గత పది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో 25 వేల రూపాయలు నగదును గురువారం సాయంత్రం రమణమూర్తి కుటుంబ సభ్యులకు అందజేశారు. 25ఏళ్లు సుదీర్ఘకాలం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ అనారోగ్యానికి గురికావడం చాలా బాధాకరమని ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు. త్వరగా కోలుకోవాలని ధైర్యంగా ఉండాలని అన్నారు. వైద్య పరంగా సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ సహకారం అందిస్తుందని అన్నారు. రమణమూర్తి త్వరగా కొని మళ్లీ జర్నలిస్టుగా విధులలో జాయిన్ అవ్వాలని కోరుతున్నట్లు భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అద్యక్షులు బాలి విశ్వేశ్వర రావు,ఉపాధ్యక్షులు అనపర్తి రాము,కోశాధికారి కూని శెట్టి రామ మోహన్, ప్రెస్ క్లబ్ సభ్యులు
లక్కోజి శ్రీను, కూర్మారావు, సీనియర్ జర్నలిస్టులు బంకురు శ్రీను, నల్లి శ్రీను, కోట్ల లక్ష్మణ రావు , సామురతు సూర్యనారాయణ,
పాచిపెంట ప్రెస్ క్లబ్ అద్యక్షులు గౌరేశ్వర రావు, నల్లి గోవిందరావులు పాల్గొన్నారు.