తిరుపతి, మే 28 :
తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే పునాది అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారెడ్డి కాలనీలో మహానాడు 2 వ రోజు కార్యక్రమం 11వ క్లస్టర్ ఇంచార్జ్ పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో 38,39,40,41 క్లస్టర్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంతరం పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో భారీ కేకును ఏర్పాటు చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేసి అక్కడున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలే కార్యకర్తలకు దిశా నిర్దేశం అని పేర్కొన్నారు. అనంతరం 11వ క్లస్టర్ ఇన్చార్జి, టిడిపి రాష్ట్ర సీనియర్ మహిళా నేత పుష్పావతి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా గుర్తింపు లభించిందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ టిడిపి అని చెప్పారు. మొదటిరోజు మహానాడు కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రాబోయే స్థానిక సంస్థల శాసనసభ ఎన్నికలలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం ఎంతో శుభ పరిణామం అని పేర్కొన్నారు. అనంతరం పుష్పావతి యాదవ్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 38 క్లస్టర్ ఇంచార్జ్ విశ్వనాథన్ అధ్యక్షులు సంతోష్, కార్యదర్శి శ్రీనివాసులు, హేమలత, 39వ యూనిట్ ఇంచార్జ్ మురుగ, సహ యూనిటీ ఇన్చార్జి రాధికా అధ్యక్షులు ధర్మారెడ్డి కార్యదర్శి రాధిక నాయుడు సుబ్రహ్మణ్యం ఆదిలక్ష్మమ్మ వెంకటేష్ విజయ 40 వార్డ్ యూనిట్ సభ్యులు రాజ్ కుమార్ అధ్యక్షుడు బాలాజీ, నారాయణ 41వ వార్డు యూనిట్ సభ్యులు కే.వి.రమణ, ఇన్చార్జి సూరి కుమారి, నార్మల్ ప్రకాష్, మురళి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *