మనధ్యాస, నెల్లూరు, మే 22 : నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ……..గత కొన్ని రోజులుగా వైయస్ కుటుంబంపై టిడిపి అనుబంధ మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలను షర్మిలమ్మ తీవ్రంగా ఖండించారు.వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టలేక షర్మిలమ్మ పై తమ అక్కసు కక్కుతున్నారు.వైయస్ షర్మిలమ్మను చూసి వైసిపి భయపడుతుంది…ఆంధ్ర రాష్ట్రంలో వై.యస్. షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందోనని వైసిపి లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదు అని అన్నారు.వైసిపి నాయకులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , షర్మిలమ్మ టిడిపికి అంట గాకుతున్నారని మాట్లాడటం సమంజసం కాదు..వైయస్సార్ కుటుంబంపై టిడిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా షర్మిలమ్మ స్పందించారు అని అన్నారు.జగన్ మెప్పు కోసం షర్మిలమ్మపై ఆరోపణలు చేయడం మంచిది కాదు….వైయస్సార్ సూపరిపాలనను అందిస్తానని అధికారంలోకి వచ్చి, ప్రజలు ఛీదరించుకునేలా పరిపాలనను అందించారు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం, ఇసుక ను ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు….జగన్మోహన్ రెడ్డి కోసం వైయస్ విజయమ్మ వైజాగ్ లో పోటీచేసి ఓడిపోతే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను విస్మరించారు అని అన్నారు.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ తన కోసం ఓడిపోయిన తన తల్లి విజయమ్మకు రాజ్యసభ కూడా ఇవ్వలేకపోయారు…వైయస్ఆర్ కుటుంబం అంటే వైసిపి నాయకులకు మర్యాద లేదు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు.జగన్ ఈస్ట్ ఇండియా కంపెనీ లా ప్రభుత్వాన్ని నడిపారు…జగన్ తీరును చూసి వైయస్సార్ ఆత్మ క్షోభించింది అని అన్నారు.వైసిపి పార్టీ నాయకులు 11 సీట్లకు ఎందుకు దిగజారిందో తెలుసుకునే పరిస్థితుల్లో లేదు..వైసిపి నాయకులు సైతం జగన్ తీరుతో విసిగిపోయి, షర్మిలమ్మ నాయకత్వం వైపు చూస్తున్నారు అని అన్నారు.లోకంలో లేని వై.యస్.రాజారెడ్డి , వైయస్సార్ వారిపై టిడిపి చేస్తున్న దుష్ప్రచారం వారి అక్కసును బయటపెడుతుంది…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించలేక పోయారు…కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన విజయాలు చెప్పుకోలేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది అని అన్నారు. వైయస్ రాజా రెడ్డి సీమలో జరిగే అరాచకాలను ఎదిరించి, ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి అని అన్నారు.కడప ప్రజల కోసం 1973లో 70 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించి, ఉచిత వైద్యాన్ని అందించారు…ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన ఘనత రాజారెడ్డిది…ఎంతోమందికి జీవితాన్నీ అందించిన మహోన్నత వ్యక్తి వైయస్ రాజారెడ్డి అని అన్నారు.వైయస్ రాజారెడ్డి చరిత్రను వక్రీకరించి, తప్పుడు రాజకీయం చేస్తున్నారు అని అన్నారు.సంక్షేమం, అభివృద్ధికి చిరునామా దివంగత నేత వైయస్. రాజశేఖర్ రెడ్డి…మన తేడా లేకుండా, పార్టీలకతీతంగా పరిపాలనను అందించిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకర్త…..పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి, 33 శాతం పనులను పూర్తి చేసిన వ్యక్తి వై.యస్. రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటి పూజ గదిలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి స్థానం లభించింది…ఎవరు ఎన్ని కూయుక్తులు పన్నినా, ప్రజల గుండెల నుండి ఆయన స్థానాన్ని చెరుపలేరు అని అన్నారు.’ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చడం చేతకాలేదు….5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికంగా అధ్వాన్నంగా కొనసాగింది అని అన్నారు.- వైసిపి నాయకులు షర్మిలమ్మను చంద్రబాబు తో ఆపాదించడం సరైన ది పద్ధతి కాదు….వైఎస్ కుటుంబంలో లోకంలో లేని వ్యక్తులపై దుష్ప్రచారం చేయడం టిడిపికి సబబు కాదు అని అన్నారు.వైయస్ కుటుంబం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు….బాబు, జగన్, పవన్(బిజెపి) పార్టీ కేంద్రంతో ప్రజల కోసం ప్రశ్నించలేక పోతున్నారు అని అన్నారు. తమిళనాడు విజయ్ కూడా కాంగ్రెస్ వైపు నిలబడి, ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డారు….కాంగ్రెస్ పార్టీ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది….ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *