తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి)

మండలంలోని తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను చిత్తూరు ఎస్డిపిఓ వెంకటనారాయణ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ డివిజన్ వెంకటనారాయణ, బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేయడం జరిగింది. అనంతరం ఆయన స్టేషన్ పరిసరాలను, రికార్డులను, పెండింగ్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన ఫిర్యాదులను ఎలా పరిష్కరించాలి, వారితో ఎలా మాట్లాడాలి స్నేహపూర్వకంగా వ్యవహరించి, పోలీసు శాఖపై విశ్వాసం పెంచే విధంగా పనిచేయాలని, సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు సైబర్ క్రైమ్ గురించి ప్రజల్లో అవగాహన కలిగే విధంగా సదస్సులు నిర్వహించి గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచాలని ఆయన కోరారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారు చెప్పే ఫిర్యాదుల మేరకు సమస్యలను ఓర్పుతో వినాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిసి కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేసి అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు మరియు సిబ్బందులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *