తిరుపతి పార్లమెంట్ 4వ క్లస్టర్ ఇన్ ఛార్జ్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఈరోజు ‘వర్చువల్ మహానాడు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి , తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మి తో కలిసి పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రారంభం సందర్భంగా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి , పనబాక లక్ష్మి , 4వ క్లస్టర్ ఇంచార్జీ శ్రీధర్ వర్మ తో కలిసి,పార్టీ శ్రేణుల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం విశ్వవిఖ్యాత తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షలు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:ఎన్టీఆర్ సిద్ధాంతాలే మనకు ఊపిరి కావాలి.

బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి అని తెలిపారు.

జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో,కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేశ్ సారధ్యంలో పార్టీ మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ 4వ క్లస్టర్ పరిధిలోని వార్డు అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *