• సాధారణంగా మహానాడు అంటే భారీ బహిరంగ సభలు, పసుపు పండుగ వాతావరణం కనిపిస్తుంది.
  • కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు చర్యలను పాటిస్తూ పసుపు పండగను వర్చువల్ గా నిర్వహించడం జరుగుతుంది.
  • ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 10వ క్లస్టర్ కు సంబంధించి సీనియర్ నాయకులు ఆర్.సీ. మునికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మహానాడు సమావేశంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్క కార్యకర్త గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
  • పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
  • జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
  • ఈ వర్చువల్ సమావేశంలో 10వ క్లస్టర్ పరిధిలోని బూత్ స్థాయి కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జులు,పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకురాళ్లు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *