మన ధ్యాస, నెల్లూరు, మే 24 : నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు అధ్యక్షతన గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతి ప్రదానోత్సవం” రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన గోల్డ్ మెడల్ బహుమతి ప్రదాన కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.తేలి సాహు మహా సంఘఠన్, న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షులు సాహు మురారి గుప్తా , జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ గుప్తా విశిష్ఠ అతిథులుగా హాజరయారు. మాజీ ఎమ్మెల్సీలు గౌనివాని శ్రీనివాసరావు , బచ్చల పుల్లయ్య , గాండ్ల తెలికుల దేవ తిలకుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) వైస్ చైర్మన్లు అడ్డా వీర వెంకటరాజు , చిట్యాల సూర్యనారాయణ , డిప్యూటీ సెక్రటరీ జనరల్ కాశిన సత్యనారాయణ హాజరయ్యారు. అతిథులుగా తేలి సాహు మహా సంఘఠన్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ , ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు సాయి లక్ష్మి, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యురాలు పెనగలూరు హేమావతి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాల్యం రామసుబ్బులు , గాండ్ల తెలికుల ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ విశాలాక్షి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గాండ్ల, తెలికుల సమాజానికి చెందిన ఎస్.ఎస్.సి సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు మాట్లాడుతూ…. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాండ్ల తెలికుల కార్పొరేషన్‌ను నిధులు, విధులతో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా మధుసూదన్ మాట్లాడుతూ…. కులానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించడం ద్వారా సమాజం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.వర్కింగ్ ప్రెసిడెంట్ నరవ అనంతం మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర కోశాధికారి లీలా కృష్ణ కుమార్ మాట్లాడుతూ గాండ్ల తెలికుల యువత మహిళలు స్వావలంబన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 28 జిల్లాల నుండి గాండ్ల, తెలికుల, దేవ తిలకుల కులస్తులు, గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా శాఖల ప్రతినిధులు, మహిళా కన్వీనర్లు, యువజన కన్వీనర్లు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *