ఏర్పేడు మే 24.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని మర్రిమంద సచివాలయం వేదికగా శ్రీ బాలాజీ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ, ఆరోగ్య కార్డులు అవసరమైన వారు తనను సంప్రదించాలని సూచించారు.
శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గంట శరత్ కుమార్ రెడ్డి, క్యాంప్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కృష్ణకాంత్ నేతృత్వంలో సుమారు 15 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు మరియు పీజీ డాక్టర్లు వారిలో:
డాక్టర్ ప్రవీణ వర్మ (స్త్రీ ప్రసూతి వైద్యం)
డాక్టర్ రమణ కిశోర్ (కంటి వైద్యం)
డాక్టర్ మణికంఠ (దంత వైద్యం)
డాక్టర్ నిఖిల్ (సర్జరీ)
డాక్టర్ కార్తీక్ (జనరల్ మెడిసిన్)
డాక్టర్ యతిరాజ్ (ఆర్థోపెడిక్) పాల్గొన్నారు.రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గైనకాలజీ, ఆర్థోపెడిక్, డెంటల్, మరియు జనరల్ మెడిసిన్ విభాగాల్లో రోగులకు వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వైద్య బృందం మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


