తుడా ను రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాం

చెప్పిన పనిని చేసి చూపించడమే నా లక్ష్యం.

అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోనే ‘తుడా’ను నంబర్ వన్ స్థానంలో ఉంచడమే లక్ష్యం

ఏడాది పాలనపై ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ మీట్

విజయవంతమైన ఏడాది కాలానికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ కి ఆయన ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు.తుడా పూర్వ చైర్మన్‌లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.గడిచిన ఏడాది కాలంలో అభివృద్దే ధ్యేయంగా, పారదర్శక పాలనతో తుడా అపూర్వమైన మైలురాళ్లను అధిగమించి ప్రగతి పథంలో దూసుకుపోతోంది” అని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జఠిలమైన సమస్యలను పరిష్కరిస్తూ, తుడా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు.ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తుడా ఛైర్మన్ ఏడాది కాలంలో సాధించిన విజయాలు, ప్రగతి నివేదికలోని ముఖ్యాంశాలను వివరించారు.దాదాపు ఐదు దశాబ్దాలుగా నలుగుతున్న శెట్టిపల్లి భూ బాధితుల సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందని,సీఎం ఆదేశాల మేరకు పేద లబ్ధిదారులపై పైసా భారం పడకుండా సుమారు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వమే పూర్తిగా మాఫీ చేసిందని తెలిపారు.
ఈ-డిప్ లాటరీ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా 1,711 మంది లబ్ధిదారులకు (1432 హౌస్ సైట్లు, 279 అగ్రికల్చర్ సైట్లు) భూ కేటాయింపులు జరిపి, ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.తుడా ఏర్పడి 81 సంవత్సరాలు అవుతున్నా, ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 400 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశామని, దీని ద్వారా తుడా సంస్థకు రూ. 400 నుంచి 500 కోట్ల ఆదాయం సమకూరతున్నట్టు తెలిపారు.తిరుపతి పరిసర ప్రాంతాల జీవనాడి అయిన స్వర్ణముఖి నదిని కాపాడుకోవడానికి “ఆపరేషన్ స్వర్ణ” కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి వేగవంతం చేశామని అన్నారు.నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలను అడ్డుకుంటూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి మరియు భూగర్భ జలాల పెంపుదలకు తుడా నిరంతరం శ్రమిస్తోందన్నారు.తుడా పరిధిలోని 9 నియోజకవర్గాల అభివృద్ధికి సమానంగా సానుకూలత చూపిస్తూ, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లానని,మిగిలిన నియోజకవర్గాల ప్రజలు కూడా తుడా పరిధిలోకి రావాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు.తిరుపతి నగర ప్రజలకు, వచ్చే యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయడమే మా ప్రధాన ధ్యేయమని,ఇందులో భాగంగా ఉప్పరపల్లి పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ, అధునాతన డ్రైనేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.అలాగే తెలుగు గంగ పైప్‌లైన్ తరలింపు పనులను కూడా తుడా నిధులతో సమన్వయం చేసుకొని రహదారుల నిర్మాణాన్ని సుగమం చేస్తున్నామని తెలిపారు.ఏడాది కాలంలో 3 బోర్డు సమావేశాలు, అభివృద్ధిపై 30 ప్రత్యేక సమావేశాలు, కలెక్టరేట్‌లో 12 సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టానని తెలిపారు. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి అవిలాల చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేశామని,చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, సాగునీటి శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటి ప్రవాహ నిర్వహణను క్రమబద్ధీకరిస్తున్నమన్నారు.తుడాపై నమ్మకంతో ప్రజలు ముందుకు రావడంతో 1,500 ఎకరాలకు అప్రూవల్స్ ఇచ్చామని, మంచి హోటళ్ల అభివృద్ధికి కూడా అనుమతులు మంజూరు చేశామన్నారు.రాబోయే రోజుల్లో తిరుపతి గ్రామీణ ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తున్నామని,అలాగే పర్యావరణ హిత ఇంధనాన్ని ప్రోత్సహించేలా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు మరియు ఓయి ఎం సర్టిఫికేషన్ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు.గడిచిన ఈ ఏడాది కాలం కేవలం ఆరంభం మాత్రమే. తుడా పరిధిలోని ప్రతి గ్రామం,ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా మా సిబ్బంది, అధికారులు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. తుడా అభివృద్ధి నమూనాపై దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇచ్చామని,జపాన్, సౌత్ కొరియా, యూకే వంటి అంతర్జాతీయ దేశాల పర్యటనల్లో సైతం తుడా అభివృద్ధిపై ప్రశంసలు దక్కాయన్నారు. నిరంతరం సహకరిస్తున్న స్థానిక ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *