తిరుపతి:

తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కొంగుబంగారం, సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. గంగమ్మ జాతర మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇంతటి పవిత్రమైన వేడుకలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *