పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (2025-26) సభ్యులు ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి కమిటీ సభ్యులకు సాదర స్వాగతం పలికి, వారితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

పార్లమెంటరీ కమిటీ సభ్యులు మరియు తుడా చైర్మన్ ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం, తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు,హౌసింగ్ స్కీమ్‌లు మరియు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కమిటీ సభ్యులకు తుడా చైర్మన్ వివరించారు.

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో తుడా చేపడుతున్న అభివృద్ధి పనులను, హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్‌ లో అనుసరిస్తున్న విధానాలను పార్లమెంటరీ కమిటీ సభ్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *