నిజాంసాగర్(జుక్కల్): యాభైశాతం సబ్సిడీపై వ్యవ
సాయ పనిముట్లు సరఫరా చేస్తున్నామని రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని అన్నారు.మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం వద్ద బూర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు సబ్సిడీ రొటవేటర్లను మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కలిసి
రైతులకుఅందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాక్టర్లకు యంత్ర పరికరాలు, రైతులకు పురుగు మందులు పిచికారి చేసేయంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచులు రమేష్ యాదవ్, కుమ్మరిరాములు,కిరణ్, హరిన్ ,జీవన్,నాయకులు నాగభూషణంగౌడ్, లోక్యానాయక్,అతిక్ తదితరులు ఉన్నారు.