మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
ప్రజా పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నిర్మించుకున్న చాకలి జయశ్రీ ఇంటిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేమల్లికార్జున్ టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..జుక్కల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో చాకలి జయశ్రీ ఇంటిని నిర్మించుకొని ప్రభుత్వ పథకాన్ని పొంది గూడు సౌకర్యాన్ని కల్పించుకోవడం ఆ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకం ఇంటింటికి చేరుతుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు శాలువా పుల మాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, ఉప సర్పంచ్ రమేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *