మన ధ్యాస,నిజాంసాగర్ జుక్కల్ గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని గుర్రపు సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమిత్ర అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏవైనా సమస్యలు ఉంటే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువస్తే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మేంగారం కవిత పండరి, నాయకులు గుర్రపు శ్రీనివాస్,గ్రామ పంచాయతీ కార్యదర్శి భారతి, వార్డు సభ్యులు రాజ్యం సాయిలు, కొల్ల చిరంజీవి,తదితరులు ఉన్నారు.