జలదంకి, మార్చి 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.
నెల్లూరు జిల్లా జలదంకి మండలం వేములపాడు గ్రామంలో మాదిగల భూములను ఆ గ్రామ వడ్డెర కులమునకు చెందిన బెల్లంకొండ వెంకమ్మ వారి బంధువులకు దారాదత్తం చేసి మాదిగల భూములను అన్యాయక్రాంతంకి గురిచేసిన చినక్రాక వీఆర్వో పై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నేతలు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, పందిటి అంబేద్కర్ మాదిగ, గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు డిమాండ్ చేశారు, జలదంకి మండలం చిన్నక్రాక రెవిన్యూ గ్రామ సర్వేనెంబర్ 701 లో 11 ఎకరాల ఎనిమిది సెంట్లు వ్యవసాయ భూమి బద్దిపూడి రోశయ్య అనువంశంగా పొందియుండి తదనంతరం వారి వారసులైనటువంటి వెంకటయ్య మరియు వెంకటయ్య కుమారులు బద్దిపూడి తిరుపాలు బద్దిపూడి వెంకటేశ్వర్లు హక్కు అనుభవం కలిగి సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద చినక్రాక వీఆర్వో తప్పుడు డాక్యుమెంట్లు ప్రలోభాలకు లోబడి ఆగ్రామ వడ్డెర కులమునకు చెందిన బెల్లంకొండ వెంకమ్మ మీద 1బి అడంగల్ నమోదు చేయించి ఆమె ద్వారా బెల్లంకొండ రాయుడుకి రిజిస్ట్రేషన్ చేయించడం రిజిస్ట్రేషన్ అనంతరం ముటేషన్ ద్వారా బెల్లంకొండ సుబ్బరాయుడు వన్ బి అడంగల్ పొందడం జరిగింది మరి ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ నేడు జలదంకి తహసిల్దారు గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇప్పటికే అనగా 2011లో ఈ భూమికి సంబంధించి వడ్డెర కులస్తులైన బెల్లంకొండ వెంకమ్మ బంధువులు గౌరవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కావలిలో కేసు వేయటం జరిగింది ఆకేసు 2015లో డిస్మిస్ కావడం జరిగింది . మళ్లీ అదే కోర్టులో మరలా బెల్లంకొండ వెంకమ్మ బందువులు వారి తరుపున కేసు వేయడం జరిగింది ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరించి చినక్రాక వీఆర్వో బెల్లంకొండ రాయుడు తదితరులు స్థానిక తహసిల్దారి వారిని తప్పుదారి పట్టించి రికార్డులు తారుమారు చేయడం జరిగిందని ఈ పొలం విషయంలో మాజీ వీఆర్వో ప్రమేయం ఉన్నట్లు ఆయన ప్రస్తుత వీఆర్వోని ప్రలోభ పెట్టి మరి ఈవిధంగా భూమాఫియా చేస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఈవిషయంలో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని రికార్డులు ట్యాంపరింగ్ చేసి తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించడం తమకున్న పలుకుబడితో పొలం జోలికి వస్తే మాదిగలపై దాడులు చేస్తూ దౌర్జన్యంగా చంపుతామని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ భూమాఫియాకు కారుకులైనటువంటి ఎక్స్ వీఆర్వో ప్రస్తుత వీఆర్వో బెల్లంకొండ వెంకమ్మ,బెల్లంకొండ రాయుడు వారి బంధువులు పై చట్టపరమైన చర్యలు తీసుకుని మాదిగలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా కమిటీ సమీక్షించుకొని ప్రజా పోరాటానికై ఎమ్మార్పీఎస్ సిద్దపడుతుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భూమి వారసులైనటువంటి బద్దిపూడి తిరుపాలు,బద్దిపూడి వెంకటేశ్వర్లు,బద్దిపూడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు