మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నూతన మున్సిపల్ పాలకవర్గం ఘనంగా కొలువుదీరింది.సోమవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్‌గా సీమ షెట్కార్, వైస్ చైర్మన్‌గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం జిల్లా రిటర్నింగ్ అధికారి చందర్ నాయక్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.నూతన పురపాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ, బిచ్కుంద పట్టణ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లులు గొనె హన్మవ్వ,నౌషా నాయక్,గుళం సంధాని,ముజాహిద్,దర్పల్ గంగాధర్,కార్తీక,మారుతి పటేల్,మఠం మానస మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం,తహసీల్దార్ వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *