

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మంత్రులు రాకతో అరెస్టు చేయడం ఎంతవరకు సమంజనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్
అన్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు రాకతో ముందస్తుగా మాజీ జడ్పిటిసి జయప్రదప్ ను బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేసినట్లు ఆయన మన దినపత్రికకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును ఎన్నికల సమయంలో నాయకులను ప్రతి ఒక్కరిని పరిచయం చేసి గెలిపిస్తే మాకు ఈ విధంగా మంత్రులు వస్తే అరెస్టు చేయడం ఎంతవరకు సమాజం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ కష్టపడి ప్రతి కార్యకర్తలకు అండగా ఉండి మేము పనిచేస్తుంటే మంత్రులు వస్తే మేము ఎందుకు అడ్డుకుంటామని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపి పిసిసి అధ్యక్షునికి, మంత్రులకు కలసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు న్యాయం జరుగుతుందని త్వరలో వివరించడం జరుగుతుందని ప్రదీప్ తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ నాడు ఇన్చార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అభివృద్ధి అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముందస్తుగా జుక్కల్ నియోజకవర్గం లో అరెస్టు చేసిన ఘనత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి దక్కుతుందని మాజీ జెడ్పిటిసి జయ ప్రదీప్ తెలిపారు. మేము అభివృద్ధి గురించి పాటుపడుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.