దుత్తలూరు, నర్రవాడ జనవరి 25, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె )
ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్రవాడ గ్రామంలో వెలసిన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . *తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించగా, అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది.
