ఎమ్మెల్యే కాకర్ల కి కృతజ్ఞతలు తెలియజేసిన రావిపాడు యువత, గ్రామ ప్రజలు.

వింజమూరు,జనవరి14,మన న్యూస్,(నాగరాజు కె).

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు రావిపాడు గ్రామానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని,ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,ఘనంగా,సన్మానించారు.తమ గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రజల చిరకాల కోరికగా ఉన్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న లింక్ రోడ్డును, ప్రజల అవసరాలను గుర్తించి రూ.82 లక్షల వ్యయంతో మంజూరు చేయించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఎమ్మెల్యే కి ఆ గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ లింక్ రోడ్డుతో రావిపాడు గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వంటి అనేక రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని యువత ఆనందం వ్యక్తం చేశారు.గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వాన్ని వారు కొనియాడారు.గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ,తమ సంతోషాన్ని, ఆశాభావాన్ని వ్యక్తం చేసిన యువత, ప్రజల ఆకాంక్షలకు స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే కి మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *