వనిపెంట హైమావతిని ఎం పీ పీ గా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య.ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత.నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక..
వింజమూరు,జనవరి 05,మన న్యూస్,(నాగరాజు కె )
రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత వారం రోజులు జరుగుతున్న హైడ్రామాకు తెరదించుతూ, వింజమూరు ఎంపీపీ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సమక్షంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి నిర్మలాదేవి, ఆధ్వర్యంలో జరిగింది. వింజమూరు మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా, సెగ్మెంట్ వన్ ఆనంగి రమణయ్య, సెగ్మెంట్ 3 వనిపెంట హైమావతి, సెగ్మెంట్ 5 సాధ మౌనిక, కాటేపల్లి పల్లా పురుషోత్తం, శంఖవరం బసిరెడ్డి సుమలత, బుక్కాపురం కాటం ప్రసన్న,ఆరు మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఫోరం సరిపోవడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.వింజమూరు నడి మూరు సెగ్మెంట్ 3ఎంపీటీసీ సభ్యురాలు వనిపెంట హైమావతిని ఎంపీపీగా వింజమూరు సెగ్మెంట్ 1 నుండి ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య ప్రతిపాదించగా, శంఖవరం ఎంపీటీసీ సభ్యురాలు ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత బలపరిచింది. ఒకే నామినేషన్ రావడంతో, పోటీ లేకపోవడంతో, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు.గత వారం రోజులుగా వైసిపి, టిడిపి ఇరువర్గాలు క్యాంపులు నడిపారు. టిడిపి ఎం పీ టీ సీ లను వైసిపి నాయకులు కిడ్నాప్ చేశారు. అయినప్పటికీ 6 మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కలిగిరి సి ఐ వెంకటనారాయణ సమక్షంలో ఎస్సై వీర ప్రతాప్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.అనంతరం వనిపెంట హైమావతి రిటర్నింగ్ అధికారి నుండి డిక్లరేషన్ ఫారం ను అందుకున్నారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి నిర్మలాదేవి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పలువురు నాయకులు ఎంపీపీ వనిపెంట హైమావతిని, వనిపెంట సుబ్బారెడ్డి ని మిగిలిన ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి, అండగా నిలిచిన ఎంపీటీసీలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
