పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పొదుపు మహిళలకు చక్కని అవకాశం..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.. కుటుంబాలకు భరోసాగా నిలవండి..
వింజమూరు, జనవరి 5,మనన్యూస్,(నాగరాజు కె )
పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని,పొదుపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు. సోమవారం వింజమూరు లోని వెలుగు కార్యాలయ ప్రాంగణంలో పెరటికోళ్లను పొదుపు మహిళలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వింజమూరు మండలంలో 100 యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క యూనిట్ కి 11 కోళ్లు చొప్పున మూడు పుంజులు, 8 కోళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. 3300 ఒక్కొక్క యూనిట్ విలువ కాగా, 300 రూపాయలు మెడికల్ కిట్ కూడా అందులో ఉంటుందన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రాంగణం అవసరం లేదని, ఇంటి పెరటి ఆవరణంలో వీటిని పెంచవచ్చునన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని కుటుంబానికి భరోసాగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, ఏపీఎం సుధాకర్ సీసీలు ఈ ఓ ఎస్ పొదుపు మహిళలు తదితరులు ఉన్నారు.
