రికార్డు స్థాయిలో దాన్యం కొనుగోలు..జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి

వరికుంటపాడు జనవరి 3,మన న్యూస్ (నాగరాజు కె )

గత సంవత్సరం 2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతం అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే నగదు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 5 లక్షల 48 వేల మంది రైతుల ఖాతాలలో 8120 కోట్ల రూపాయల నగదును జమ చేశారన్నారు. మామిడి, పొగాకు, కోకో, ఉల్లి, పంటల రైతులకు 1100 కోట్ల రూపాయల ప్రభుత్వ సాయం అందించింది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేయడం, ఇల్లు లేని పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెట్ల చొప్పున దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా ఇంటి స్థలం అందజేయడం జరుగుతుందన్నారు. యువనేత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చడం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ అందజేయడం, పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించడం, ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు 75 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ లు నిర్వహించడం, విద్యార్థుల్లో పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించడం, 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ కరెంటును ఏర్పాటు చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇదేవిధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగాలని మేకపాటి శాంతి కుమారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *