శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం
వరికుంటపాడు జనవరి 3, మన న్యూస్, (నాగరాజు కె).
వారికుంటపాడు మండలం వైకుంటపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాతలుగా ప్రకాశం జిల్లా పామూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గాజులపల్లి శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి దంపతులు వారి కుమారులు గాజులు పల్లి సాయినాథ్ కుమార్తె స్వాతి రెడ్డి శాశ్వత నిత్య అన్నదానం కొరకు 101116 రూపాయలు దాతగా అందజేశారు. వారికి ఆలయ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ స్వామివారి చిత్రపటం దుశ్యాలవాతో సన్మానించారు. వారికి ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా పామూరు గ్రామానికి చెందిన సోమిశెట్టి శ్రీనివాసులు శ్రీలత దంపతులు ప్రసాదం కొరకు 30 కేజీల బెల్లాన్ని అందజేశారు. రామాపురం గ్రామానికి చెందిన రావెళ్ల నాగేంద్ర కుమార్, అరుణ కుమారి దంపతులు పుట్టినరోజు సందర్భంగా 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. దొండల వెంకటేశ్వర్లు అశ్వనీ దంపతులు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాతల అందరికీ ఆలయ ధర్మకర్త సూర్యనారాయణ అమ్మాజీ దంపతులు స్వామివారి చిత్రపటాలతో సన్మానించారు.