వింజమూరు,మన న్యూస్,డిసెంబర్ 16,(కె నాగరాజు).

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా డ్వాక్రా సంఘాలకు సబ్సిడీ రుణాల పంపిణీ ద్వారా గ్రామీణ మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచడం,చిన్నతరహా మరియు కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పథకం కింద అర్హులైన మల్లిశెట్టి.లక్ష్మీ, మోరం.లక్ష్మమ్మలకు స్థానిక యువ నాయకులు మార్నేని రామకృష్ణ, డ్వాక్రా సంఘాధికారి (ఎ.పి.ఎం) సుధాకర్ సమన్వయంతో రుణాలు మంజూరు చేయబడినాయి. ఈ మంజూరైన రుణపత్రాలను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా లబ్ధిదారుల అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ,ఓసీ మరియు బీసీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 25 శాతం సబ్సిడీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు 35 శాతం సబ్సిడీతో ప్రభుత్వ పరంగా అందించబడుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆయనఆకాంక్షించారు. అలాగే స్థానిక నాయకులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మహిళల అభివృద్ధి ద్వారానే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుండ్ల నరసింహారావు,మద్దినేని తిరుపాలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *