మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో దత్త జయంతి వేడుకలను గ్రామస్థులు ఎంతో వైభవంగా నిర్వహించారు.లక్ష్మీనారాయణ మందిరంలో పురోహితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గీత యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ దేవాలయానికి విచ్చేసి స్వామి వారి దర్శనం తీసుకుని ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ పెద్దలు, పండితులు, యువత, మహిళలు, గ్రామస్థులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజాపండరీ, లక్ష్మణ్ దాస్ ,రమేష్,బొజ్జ అంజయ్య,తదితరులు ఉన్నారు










