వింజమూరు, మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 3 (నాగరాజు కె)

వింజమూరు మండలం గోళ్ళవారిపల్లి గ్రామంలో చిరుకూరి రమణయ్య ఉత్తర క్రియల కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన చిరుకూరి రమణయ్య చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి,ఆయనకు హృదయ పూర్వకంగా ఘన నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ధైర్యం చెప్పితన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంతేకాక,భవిష్యత్తులోఎలాంటి సహాయం అవసరమైనా ఎల్లప్పుడూ అండగా,తోడుగా నిలబడతానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బంధుమిత్రులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు










