రైతన్నా! మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే కాకర్ల సురేష్
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రెండు విడతల్లో రూ,14,000 జమ.*విత్తనాలు,ఎరువుల సరఫరాలో ముందంజలో ప్రభుత్వం:ఎమ్మెల్యే కాకర్ల సురేష్

జలదంకి, మన ధ్యాసన్యూస్, డిసెంబర్ 3, (నాగరాజు కె):

వింజమూరు సబ్‌డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా! మీకోసం”కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థులకు తెలియజేస్తూ,మన రాష్ట్రం ఆర్థిక పరంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మన రైతు ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తోందని అన్నారు.ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతూ, రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తున్నాయని వివరించారు.రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు “అన్నదాత సుఖీభవ పథకం-పీఎం కిసాన్” ద్వారా ఇప్పటికే రెండు విడతలుగా రూ.14,000 నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వం చేసిన కీలక నిర్ణయమని చెప్పారు.ఈ ఆర్థిక సహాయం రైతుల సాగు పనులకు ఎంతో ఉపశమనం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.ఇక రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు తదితర అవసరమైన సాగు సరఫరాలను ప్రభుత్వం సమయానికి అందిస్తూ, రైతుల పంట ఉత్పాదకతను పెంచేందుకు అన్ని విధాలా సహాయకర్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.రైతు కుటుంబాలను బలోపేతం చేయడం,గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేయడం లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం