

Mana News :- రేణిగుంట:- రేణిగుంట శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం లో ఉద్రిక్తత నెలకొంది ఆలయం లో అమ్మ వారికి అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయం లోని ఓ మహిళ నైటీ వేసుకొని గర్బగుడి లోకి వచ్చింది. మరో మహిళ నైటీ వేసుకుని ఆలయంలోకి ప్రవహించడమే కాకుండా అక్కడున్నటువంటి ఓ భక్తురాలపై చేయి చేసుకుంది. ఇదేమి ఎందుకు కొట్టారు అని అక్కడ ఉన్న భక్తులు అడగ్గా వారి పైన కూడా చేయి చేసే యత్నం చేసింది. అనంతరం ఆ మహిళకు మరియు భక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల చోద్యంతో ఈ గొడవ కాస్త సదమణిగింది.భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయాన్నికి వస్తున్న భక్తులు పైన ప్రతినిత్యం ఈ మహిళలు ఇలా ఏదో ఒక రకం గా గొడవ పడుతున్నారు అని ఆలయానికి ఎవరు రాకూడదు అని అంటున్నారు అని భక్తులు అన్నారు.ఆలయ పీఠాధిపతులు శ్రీ మూర్తి స్వామి మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఇలా వచ్చి భంగం కలిగించడం తప్పు అని హిందూ ధర్మాన్ని ఇలా బ్రష్టు పట్టించే వాళ్ళని ఎవరిని ఊరికే వదలమని పవిత్రమైనటువంటి ఆలయంలో ఆడవాళ్లు రాడమే పాపమని అలాంటిది ఆడవాళ్లు రాడమే కాకుండా నైటీలు వేసుకొని మరీ రావడం తప్పు అని ఆయన పేర్కొన్నారు.ఏది ఏమైనా ఆలయంలో పని చేస్తునట్టు వంటి మహిళల లకు ఉపాధి ఇస్తే ఆలయానికి వచ్చే భక్తుల ను ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధ గా ఉంది.
