విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి సదుపాయాలను పరిశీలించారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన AI ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ కొత్త క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ..విద్య యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులను ప్రేరేపించారు. ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు, ల్యాబొరేటరీలు,క్లాస్‌రూమ్స్,మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించడం కీలకమైన నిర్ణయమని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదలతో చదివి తమ గమ్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్,తదితరులు ఉన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్