చిత్తూరు, మన ధ్యాస, నవంబర్13
చిత్తూరు ఎస్టియు ఆఫీసు నందు మామిడి రైతు సంఘం కార్యవర్గ సమావేశం మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించిఅధ్యక్ష కార్యదర్శులు. మునీశ్వర్ రెడ్డి బంగారు మురళి మాట్లాడుతూ. మామిడి రైతులకు గుజ్జు పరిశ్రమలు 8రూపాయల లెక్కన చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. అలా చర్యలు తీసుకోని పక్షంలో డిసెంబర్ నెలనందు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది మామిడి రైతులతో ముట్టడి చేయాలని ఈ దినం సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలని లెక్క చేయని గుజ్జు పరిశ్రమలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని మండిపడ్డారు.. ప్రభుత్వo 40 వేల మంది మామిడి రైతుల పక్షమా లేక 40 గుజ్జు పరిశ్రమల పక్షమా తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వం 8 రూపాయలు గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు ఇవ్వాలని ఆర్డర్ వేసిన తర్వాత. ఇవ్వని గుజ్జు పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుందని తెలిపారు…. ప్రభుత్వ సబ్సిడీ పొందేటందులో.ర్యాంపులు తప్పుడు తూకాలతో తప్పుడు లెక్కలు సృష్టించాయని. అవి లెక్క తేలక అధికారులు తలలు పట్టుకున్నారని. ఈ విధానాన్ని గమనిస్తే. మామిడి రైతుల ముసుగులో దళారులు. ర్యాంపు యజమానులు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని. రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర దొంగల పరమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు.హేమలత. సంజీవరెడ్డి. మునిరత్నం నాయుడు. ఉమాపతి నాయుడు. బెల్లంకొండ శ్రీనివాసులు. భారతమ్మ. మోహన్ రెడ్డి.సందీప్. జయదేవయ్య. చంగల్రాయ రెడ్డి. వెంకటాచలంనాయుడు.త్యాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







