మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగృహంలో కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రిని భగవంతుడి ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.








