గురువారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూ.టీ.ఎఫ్) ప్రాంతీయ కార్యాలయం, కావలి నందు యూ.టీ.ఎఫ్. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో “ట్రంప్ సుంకాలు -భారతదేశంపై ప్రభావం” *అనే అంశం మీద యూ.టీ.ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె.పరందామయ్య చాలా చక్కగా విశ్లేషణ పూర్వకముగా వివరించారు.ఈ యూ.టీ.ఎఫ్ స్టడీసర్కిల్ సమావేశానికి జిల్లా కార్యదర్శి బెల్లం మాధవరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మరియు యూ. టీ.ఎఫ్. కుటుంబ సంక్షేమ సంఘం కన్వీనర్ కె. నాగిరెడ్డి ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమములో కావలి ప్రాంతీయంలోని అన్నీ మండల శాఖల ఆఫీసు బేరర్స్, జిల్లా కౌన్సిలర్స్ మరియు సీనియర్ యూ.టీ.ఎఫ్ నాయకులు, కార్యకర్తలు మరియు యూ.టీ.ఎఫ్ అనుబంధ సంఘము జన విజ్ఞాన వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.








